ప్చ్.. వరల్డ్ కప్ నుంచి ఆ టీం అవుట్?
ఈ క్రమంలోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి అన్ని జట్లు. అయితే ఇప్పటికే 8 జట్లు నేరుగా అటు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి అని చెప్పాలి. అయితే రెండు స్థానాలు కోసం అటు కొన్ని జట్లు పోటీ పడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంక విజయం సాధించి అటు వరల్డ్ కప్ కోసం అర్హత సాధించింది అని చెప్పాలి. అయితే జింబాబ్వే వేదికగా క్వాలిఫైర్ మ్యాచ్ లు జరుగుతున్నాయ్. జింబాబ్వే ఎంతో సునాయాసంగా వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతుందని అందరూ అనుకున్నారు.
అయితే ఆ జట్టు ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేస్తాడు. కానీ ఇటీవల జింబాంబ్వే కీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. వరల్డ్ కప్ నుంచి జింబాబ్వే ఔట్ అయ్యింది. ఐసీసీ వన్డే క్వాలిఫైయర్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో 31 పరుగులు తేడాతో ఓటమిపాలు అయింది. 235 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగింది. కేవలం 23 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది ఆ జట్టు. బ్యాట్స్మెన్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేక పోయారు అయితే ఇటీవల విజయంతో స్కాట్లాండ్ వరల్డ్ కప్ అర్హత సాధించేందుకు ఆశలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. జింబాబ్వే ఓటమితో ఆ దేశా అభిమానులు నిరాశలో మునిగిపోయారు.