కోహ్లీలో ఇంకా ఆ శక్తి ఉంది : క్రిస్ గేల్
అదే సమయంలో ఇక భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అటు పటిష్టమైన టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ప్రచారం రూపొందుకుంది అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే విరాట్ కోహ్లీ కోసమైనా ఇక వరల్డ్ కప్ ను గెలిపించాలి అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ఆటగాళ్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉండడం గమనార్హం. అయితే కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అంటూ జరుగుతున్న ప్రచారం గురించి వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ స్పందించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అని నేను మాత్రం అస్సలు అనుకోవట్లేదు. అతనికి మరో వరల్డ్ కప్ ఆడే శక్తి కూడా ఉంది అంటూ క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. స్వదేశంలో ఆడే టోర్నీలలో భారత్ ఎప్పుడూ కూడా ఫేవరెట్ గానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక భారత ఆటగాళ్లపై అంచనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు . ఇక ఈసారి వరల్డ్ కప్ లో పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది అంటూ తెలిపాడు. గతంలో క్రిస్ గేల్ బెంగళూరు జట్టు తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడు.