నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ విషయం చెప్పిన క్రికెట్ లెజెండ్?
ఈ క్రమంలోనే ప్రజెంట్ యాక్టివ్ క్రికెటర్లకు సంబంధించిన వార్తలే కాదు ఇక ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు సేవలందించి ఇక ఇప్పుడు మాజీ క్రికెటర్లుగా మారిపోయిన లెజెండ్స్ కు సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయి. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ హిస్టరీలో లెజెండ్ గా కొనసాగుతున్న అలెన్ బోర్డర్ కు సంబంధించిన ఒక వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఆయన ఒక వింతైన వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయం బయటకు రావడంతో అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి.
ప్రస్తుతం ఆస్ట్రేలియా లెజెండ్ అలెన్ బోర్డర్ వయసు 68 ఏళ్లు. ఇక తాను 80 ఏళ్ల వరకు బ్రతికాను అంటే అది నిజంగా అద్భుతమే అంటూ ఇటీవలే బోర్డర్ పేర్కొన్నాడు. అంతేకాదు ఇక తాను పార్కిన్సన్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అన్న విషయాన్ని కూడా ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. 2016 నుంచి ఈ నెర్వస్ డిజాస్టర్ కు చికిత్స తీసుకుంటున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు అలెన్ బోర్డర్. తను పూర్తిగా ప్రైవేట్ పర్సన్ అని.. ప్రజల తన పట్ల సానుభూతి చూపించాలి అని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన ఆస్ట్రేలియా తరఫున 156 టెస్ట్ మ్యాచ్లు 273 వన్డే మ్యాచ్లు ఆడాడు.