ఆసియా గేమ్స్ కోసం.. టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్?
ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కుతుందా లేదా అన్నది కూడా అనుమానం గానే ఉంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక శిఖర్ ధావన్ కెరియర్ ముగిసిపోయింది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. కాగా ఈ ప్రచారం నేపథ్యంలో అటు అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో అటు శిఖర్ ధావన్ అభిమానులు అందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతేసే ఒక న్యూస్ ని చెప్పబోతుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.
చైనాలోని హాంగ్ టౌన్ లో ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆసియా గేమ్స్ జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఆసియా గేమ్స్ లో అటు భారత జట్టు కూడా పాల్గొనబోతుంది. ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ టీంను పంపాలని బీసీసీ నిర్ణయించింది. ఈ సమయంలోనే టీమిండియా మెయిన్ టీం వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్న నేపద్యంలో.. ఇక ఆసియా గేమ్స్ కి ఇండియా బి టీమ్ పంపాలని నిర్ణయించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ జట్టుకు ఇక అటు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఇక ఇది ఫిక్స్ అయిపోయిందని గబ్బర్ అభిమానులు మాత్రం సంతోషంలో మునిగిపోయారు.