ఇలాంటి చెత్త పనులు ఆపండి.. పాక్ బోర్డుకి క్లాసు పీకిన మాజీ క్రికెటర్?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. అయితే ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ విషయంపై అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇక వింతగా ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటు చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ తో.. బెంగళూరులో ఆస్ట్రేలియా తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది పాకిస్తాన్. అయితే ఈ రెండు వేదికలను మార్చాలి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు ఒక డిమాండ్ పెట్టింది.


 కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన విజ్ఞప్తిని అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పట్టించుకోలేదు అని చెప్పాలి. అయితే ఇదే విషయం గురించి ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్  స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  ఐసీసీకి ఇచ్చిన వింత అభ్యర్థనను తప్పుపట్టాడు. అర్థం పడటం లేని అభ్యర్థనలతో పరువు తీయొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు  ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు చేయకండి అంటూ బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశాడు కమ్రాన్ అక్మల్. వాతావరణ పరిస్థితులు వేదికలు జట్ల విజయ అవకాశాలను ఏమాత్రం ప్రభావితం చేయలేవు  ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ లో వీటి గురించి ప్రస్తావన అనవసరం కూడా.



 భారత్.. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లను ఓడిస్తూ పోతుంది. అది వాళ్ళ సత్తా. మనమేమో ఆసిస్ తో అక్కడే ఆడతాం.. ఆఫ్ఘనిస్తాన్తో ఇక్కడే ఆడుతాం అంటూ కుంటి సాకులు వెతుక్కుంటున్నాం. మన దృష్టి మొత్తం కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి. బోర్డు సభ్యులకి ఇదే నా విజ్ఞప్తి. ఇలాంటి చెత్త ప్రమాణాలతో అభ్యర్థనలు చేయకండి. అంతర్జాతీయ క్రికెట్ విస్తృతి మరింత పెరిగింది. ఆటగాళ్లు తమ విజయాల గురించి సగర్వంగా చాటి చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మాత్రం మేము ఇక్కడైతేనే గెలవగలం అంటూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదు అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ క్రికెట్ బోర్డుకి క్లాస్ పీకాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: