వరల్డ్ కప్ సమయంలో.. ధోని రోజు కిచిడీ తినేవాడు : సెహ్వాగ్
అయితే ఈసారి మాత్రం తప్పకుండా టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ నమ్మకంతో ఉన్నారు. కాగా ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 2011 వరల్డ్ కప్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో ధోని కేవలం కిచిడి మాత్రమే తినేవాడని.. ఇది అతడి సెంటిమెంట్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆట తీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా భారత్ వరుస విజయాలు సాధిస్తుండడంతో.. ధోని ఇలాంటి సెంటిమెంట్ ని కొనసాగించాడు అంటూ తెలిపాడు.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదే కిచిడి. ప్రపంచకప్ అంతా ధోని అదే తిన్నాడు. దీనిపై అడిగితే నేను పెద్ద స్కోర్ చేయనప్పటికీ ఈ సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. మ్యాచులు గెలుస్తున్నాం. అందుకే ఇక కిచిడిని సెంటిమెంట్ గా మార్చుకొని రోజు అదే తింటున్నాను అంటూ ధోని నాకు సమాధానం ఇచ్చాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇక వరల్డ్ కప్ అంటే క్రికెట్కు ఒలంపిక్స్ తో సమానం అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్ కప్ క్షణాలు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవని.. నేను ఆడిన ప్రతిసారి కూడా ఫైనల్ కు చేరాము, ఒకసారి కప్పు కూడా గెలిచాము, మరోసారి క్వాలిఫై కాకుండానే దారుణంగా ఓటమిపాలయ్యామ్. ఇలా నా ప్రయాణం మొత్తం ఒడి దుడుకులతో సాగింది అంటూ సెహ్వాగ్ తెలిపాడు.