సర్పరాజ్ ని.. ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు తెలుసు : ఆసిస్ మాజీ

praveen
టీమిండియా మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఇప్పటికే ఈ మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్టు వివరాలను కూడా ప్రకటించింది. అయితే మొదట టెస్ట్ ఫార్మాట్ తో వెస్టిండీస్ పర్యటనను ప్రారంభించబోతుంది టీమిండియా. ఇక ఈ టెస్ట్ ఫార్మాట్లో కొంతమంది ఆటగాళ్లపై సెలెక్టర్లు వేటు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి.



 ముఖ్యంగా దేశవాళి క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్పరాజ్ ఖాన్ ను సెలెక్టర్లు వెస్టిండీస్ పర్యటన కోసం పట్టించుకోకపోవడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అతన్ని జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రాడ్ హగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందుకే భారత సెలెక్టర్లు సర్ఫరాజ్ ను సెలెక్ట్ చేసి ఉండరు అంటూ ఒక కొత్త కారణాన్ని తెలమీదికి తీసుకువచ్చాడు బ్రాడ్ హగ్.




 ఇదే విషయం గురించి తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు. రంజీ ట్రోఫీలో సర్పరాజు  సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన మాట వాస్తవమే. కానీ వెస్టిండీస్ తో టెస్ట్ ఆడే జట్టులో అతనికి చోటు ఎందుకు దక్కలేదో నాకు తెలుసు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి దేశవాళి క్రికెట్లో అతను జట్టు మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు  ఇక రెండోది ఐపీఎల్ లో ఫేసర్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో అతను విఫలం అయ్యాడు. క్వాలిటీ బౌలింగ్లో అతను పూర్తిగా తేలిపోయాడు. అందుకే సెలెక్టర్లు అతన్ని సెలెక్ట్ చేయకపోవచ్చు. అయితే ఇక ఫేస్ బౌలింగ్లో అతను మెరుగుపడినప్పుడు తప్పకుండా సెలెక్టర్లు అతని జట్టులోకి తీసుకుంటారు అంటూ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: