కోహ్లీ వల్లే.. ఇండియా టెస్ట్ క్రికెట్ ఆగం అయ్యింది : జై షా

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఒకప్పుడు కెప్టెన్ గా కూడా హవా నడిపించాడు అన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా  కొనసాగిన  విరాట్ కోహ్లీ.. ఇక భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే ఇక తర్వాత మాత్రం అనూహ్యంగా అటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్సీ బాధ్యతలు దక్కడం చక చక జరిగిపోయాయి.


 అయితే ముందుగా అటు ఐపీఎల్ లో ఆర్సిబి కెప్టెన్ గా మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత పరిమిత ఓవర్ల  ఫార్మట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదు అని భావించిన బీసీసీఐ పెద్దలు.. ఇక వన్డే ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే  టెస్ట్ కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని కావాలని కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటే విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మరోసారి క్లారిటీ ఇచ్చారు.


 టి20 వన్డేలలో విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయం రోహిత్ అని భావించాము. అందుకే అతని కెఫెన్సీ వదులుకున్న జట్టుపై అంతా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో టీమ్ ఇండియాకు చేసింది ఇంకా ఏ క్రికెటర్ చేయలేడు. భారత్ ను ఆరేళ్లపాటు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్ట గలిగాడు. అతను స్థానంలో ఇంకొకరిని ఎప్పటికీ ఊహించుకోలేం కూడా. టీమిండియాకు కోహ్లీ లాంటి మరో కెప్టెన్ కూడా దొరకడు. అతను కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పుడు బీసీసీఐ వద్దని చెప్పిన..  కోహ్లీ వినిపించుకోలేదు. అతను కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత అతని స్థానంలో ఎవరిని  నియమించాలి అనే విషయంపై సందిగ్ధంలో పడిపోయింది బీసీసీఐ. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక రోహిత్ ని టెస్ట్ కెప్టెన్ గా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విరాట్ అలా చేయకుండా ఉండాల్సింది అంటే జై షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: