రింకు బచ్చా కాదు.. బాప్ : షారుక్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో విజయానికి 31 పరుగులు కావాల్సిన సమయంలో ఇక అందరూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమి ఖాయం అని భావించారు. అలాంటి సమయంలో చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లు బాధి ఇక జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు రింకు సింగ్. దీంతో ఇక ఐపీఎల్ ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా రింకు సింగ్ వైపు చూడటం మొదలుపెట్టారు. మాజీ ఆటగాళ్ళు అతని అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు.
అయితే కేవలం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లోనే కాదు ఆ తర్వాత మ్యాచ్లో కూడా చివర్లో మెరుపులు మెరిపించి ఫినిషర్ పాత్రను పోషించాడు రింకు సింగ్ ఇక జట్టు గెలిచిన ఓడినా కూడా అతని వీరోచితమైన పోరాటం మాత్రం అభిమానులను మనసులు గెలుచుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను త్వరలోనే టీమిండియాలో జట్టులోకి రాబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇకపోతే రింగు సింగ్ గురించి కోల్కతా ఫ్రాంచైజీ సహాయజమాని బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ ప్రశంస వర్షం కురిపించాడు. రింకు బచ్చా గురించి ఒక్క మాటలోచెప్పాలని సోషల్ మీడియాలో అభిమాని కోరగా.. రింకు బచ్చా కాదు బాబ్ అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.