పాకిస్తాన్ చెప్పినట్టు.. ఐసీసీ వినకపోవచ్చు : అశ్విన్
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా అటు ఎప్పుడు ఎవరితో ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్నారు అనే విషయంపై ప్రతి జట్టుకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగానే అన్ని టీమ్స్ కూడా ప్రస్తుతం వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇటీవల ఐసీసీ ప్రకటించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ విషయంపై అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. తమ వేదికలను మార్చాలి అంటూ ఐసిసి ముందు కొత్త డిమాండ్ ను ఉంచింది పాకిస్తాన్.
ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో.. ఇక స్పిన్ కి కలిసివచ్చే చపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడటానికి పాకిస్తాన్ నిరాకరించింది. వేదికలు మార్చాలి అంటూ డిమాండ్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ డిమాండ్‌కు అనుకూలంగా వేదికలు మారిస్తే మాత్రం అటు పాకిస్తాన్ కే ప్రయోజనం కలుగుతుంది. దీంతో ఇక ఐసిసి వేదికలు మార్చే అవకాశం లేకపోవచ్చు. ఇలా కాకుండా భద్రత సమస్యలు ఉన్నాయని చెబితే మాత్రం వేదికలు మార్చే ఛాన్స్ ఉంది అంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.