శభాష్ నట్టు.. పేద క్రికెటర్ల కోసం కోసం స్టేడియమే కట్టాడు?

praveen
ఇటీవల కాలం లో ఒక్కసారి క్రికెటర్ గా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. అయితే ఎంతో మంది క్రికెటర్లు అటు ఐపీఎల్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఇలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న క్రికెటర్లలో కేవలం కొంతమంది మాత్రమే గొప్ప పనులు చేస్తూ అందరి మనసులను గెలుచుకుంటున్నారు అని చెప్పాలి. ఇక అలాంటి లిస్టులో ఇక ఇప్పుడు సన్రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న టీ నటరాజన్ కూడా చేరిపోయాడు.



 ఈ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఇటీవల తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్రికెటర్ అయ్యే క్రమంలో ఏ పేద క్రికెటర్ కూడా తనలా బాధలు పడకూడదు అనే ఉద్దేశంతో తన స్వగ్రామంలోనే క్రికెట్ స్టేడియంలో నిర్మించాడు నటరాజన్. ఈ క్రమంలోనే ఆ మైదానంలో ఉచితంగా కోచింగ్ అందిస్తాను అంటూ చెబుతున్నాడు. అయితే ఇలా పేద క్రికెటర్ల   కోసం స్టేడియం నిర్మిస్తానని ఐపిఎల్ లోకి వచ్చిన కొత్తలో చెప్పిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో ఈ క్రికెట్ స్టేడియం ను ఇటీవల ప్రారంభించాడు. ఇక ఈ స్టేడియాన్ని దినేష్ కార్తీక్ ప్రారంభించాడు అని చెప్పాలి.



 ఈ కార్యక్రమానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో పాటు తమిళనాడు ప్లేయర్స్ అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ స్టేడియంకి నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ గా నామకరణం చేశారు. క్రికెటర్ అవ్వాలని కలలు కనే పేదవాళ్లకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తామని   నటరాజన్ మరోసారి పేర్కొన్నాడు. నట్టు చేసిన గొప్ప పని  నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది. ఇక ఇదే విషయంపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ  సైతం ప్రశంసలు కురిపించింది. నట్టు చేసిన పని గురించి తెలిసి గొప్ప పని చేశావు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: