వైరల్ : రౌండప్ చేసిన నాగుపాములు.. అతనేం చేశాడో తెలుసా?
అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు కొంతమంది విషపూరితమైన నాగుపాములతో వింతగా ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయిన ఘటన చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. ఒక వ్యక్తిని నాగుపాముల గుంపు చుట్టుముట్టింది.. అయితే ఆ నాగుపాములతో అతను ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పాలి. అవి కాటేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అతను ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.
ఇక ఈ వీడియో చూస్తుంటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. నాగుపాములతో అతను వింతగా ప్రవర్తిస్తున్న తీరు చూసి అతను చేస్తున్న సాహసానికి మెచ్చుకోవాలా.. ఇక అది ఒక పిచ్చి పని అని తిట్టాలా కూడా నేటిజన్స్ కు అర్థం కావట్లేదు అని చెప్పాలి.. ఇక ఎందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గామారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా పాములతో ఆడుకోవడమే కాదు ఒక్కొక్క కోబ్రాని తన చేతుల్లోకి తీసుకుని అవి బొమ్మలేమో అన్నట్లుగా ఆడుకున్నాడు. చివర్లో ఇక ఒక నాగుపాము కి లిప్ కిస్ కూడా ఇచ్చాడు సదరు వ్యక్తి.