వావ్.. యంగ్ ప్లేయర్స్ కి.. ఇది మంచి అవకాశం?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుస సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సిరీస్ ల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. మరికొన్ని సిరీస్ లను  అటు స్వదేశంలోనే ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా. కాగా మరికొన్ని రోజుల్లో  వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే టి20 సిరీస్ లతోపాటు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కూడా ఆడబోతుంది.


 అయితే ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక చేసే జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈసారి అటు భారత సెలెక్టర్లు యంగ్ ప్లేయర్స్ కే పెద్దపీట వేయబోతున్నారు అంటూ గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం బీసీసీఐ అధికారికంగా జట్టును ప్రకటించింది.


 ఈ క్రమంలోనే ఆ వివరాలు చూసుకుంటే.. ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ఒక మంచి అవకాశం దక్కింది అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెలరేగిపోయిన రుతురాజు గైక్వాడ్ కు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్లలో కూడా ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. అదే సమయంలో ఇక అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైష్వాల్ ను టెస్ట్ జట్టులోకి తీసుకుంది. సంజు శ్యాంసన్ ను వన్డే జట్టులోకి తీసుకున్న  సెలెక్టర్లు ముఖేష్ కుమార్ ను వన్డే తో పాటు టెస్ట్ ఫార్మట్ లో కూడా సెలెక్ట్ చేశారు. అయితే వెస్టిండీస్ టూర్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా రానిస్తే ఇక ఆ ఆటగాళ్లు భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: