ఇంగ్లాండ్ వెళ్ళబోతున్న రహనే.. ఎందుకో తెలుసా?
అయితే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే పేరు రావడంతో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయాడు. అయితే ఫామ్ కోల్పోవడం తో అతని కెరియర్ ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి అదరగొట్టాడు రహనే. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న అతను దూకుడైన ఆట తీరుతో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో అదరగొట్టాడో లేదో ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఈ డబ్ల్యూటీసి ఫైనల్స్ లోను తన ప్రదర్శనతో పరవాలేదు అనిపించాడు.
అయితే మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా వెళ్లబోయే వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు అజింక్య రహనే. వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో బాగం అయ్యాడు అని చెప్పాలి అయితే ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత రహానే ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నాడు. అదేంటి రహనే ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. కౌంటి ఛాంపియన్షిప్ లో ఆడేందుకు ఇంగ్లాండు వెళ్లబోతున్నాడు. ఇంగ్లాండ్ కు బయలుదేరి అక్కడ లిస్టర్ షైర్ జట్టు తరఫున ఆడుతాడని బీసీసీఐ తెలిపింది. అయితే కౌంటి ఛాంపియన్షిప్ తర్వాత ఆగస్టులో రాయల్ లండన్ లీగ్ లో పాల్గొంటారని.. సెప్టెంబర్ లో నాలుగు కౌంటి మ్యాచ్ లు ఆడతాడని బిసిసిఐ వర్గాలు తెలిపాయి.