వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్.. చెత్త రికార్డు?
ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో హోరాహోరీగా పోరును సాగిస్తూ ఉంటాయ్ అని అందుకే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యాషేష్ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్లు కూడా పోటీ పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ లబుషేన్ కి ఊహించిన రీతిలో చేదు అనుభవం ఎదురయింది.
అతని టెస్ట్ క్రికెట్ కెరియర్లో మొదటిసారి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు లబుషేన్. ఏకంగా మొదటిసారి గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు అని చెప్పాలి. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు లబుషేన్. కాగా ఇతగాడిని ఇంగ్లాండ్ బౌలర్ తొలి బంతికే బోల్తా కొట్టించి వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ వేసిన బంతిని లబుషేన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బాల్ బ్యాట్ ఎడ్జ్ ను తాకి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. కాగా టెస్ట్ ఫార్మాట్ లో అతనికి డకౌట్ అవడం నాలుగో సారి.. అయితే గోల్డెన్ డకౌట్ అవడం మాత్రం కెరియర్ లోనే మొదటిసారి.