పెళ్లి చేసుకున్న.. మరో భారత క్రికెటర్?
టీమిండియా యంగ్ బౌలర్ ప్రసీద్ కృష్ణ సైతం ఇటీవల తన ప్రేయసిని పెళ్లి చేసుకుని ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా వరుసగా క్రికెటర్లు పెళ్లి చేసుకుంటూ ఉండడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో యంగ్ క్రికెటర్ కూడా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు అనేది తెలుస్తుంది. 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడి తన బౌలింగ్తో ఆకట్టుకున్న తుషార్ దేశ్పాండే ఓ ఇంటివాడయ్యాడు.
నభ గడ్డన్ వార్ ని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు తుషార్ దేశ్ పాండే. ఇక ఈ వేడుకకు టీమ్ ఇండియా క్రికెటర్ శివం దుబాయ్ కూడా హాజరయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అందరూ ప్రస్తుతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో కేవలం 20 లక్షల కనిష్ట దరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ బౌలర్ తుషార్ దేశ్పాండే. ఇక 16 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి.