WTC: రహానే సూపర్ రికార్డ్.. రోహిత్, కోహ్లీలపై ట్రోల్స్?

Purushottham Vinay
WTC : రహానే సూపర్ రికార్డ్.. రోహిత్, కోహ్లీలపై ట్రోల్స్?

ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆదుకుంటారనుకున్న రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, చటేశ్వర్‌ పుజారా వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఇండియాకు కష్టాలు తప్పలేదు.కేవలం 150 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఫాల్ఆన్ తప్పదనుకునే టైంకి రహానే- శార్దూల్‌ జోడి ఆ గండం నుంచి గట్టెక్కించారు.151 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రహానే- శార్దూల్‌ ఎంతగానో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు మొత్తం 109 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తరువాత ఆట ప్రారంభమైన కొద్ది సేపటికి రహానే వెనుదిరిగాడు. క్రిస్ గ్రీన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 89 పరుగుల్ వద్ద అజింక్య రహానే పోరాటం ముగింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఉమేష్ యాదవ్(5) రూపంలో ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పస్తుతానికి శార్దూల్-షమీ ఆసీస్ బౌలర్లను చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు.బాగా వేగంగా ఆడుతూ ఆసీస్ లీడ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక ఇదిలా వుంటే ఈ మ్యాచులో రహానే టెస్ట్ కెరీర్‌లో మొత్తం 5000 పరుగులు మెయిలు రాయిని అందుకున్నాడు. ఇండియా తరపున టెస్ట్‌లలో ఆ ఘనతను సాధించిన 13వ ఆటగాడిగా రహానే చరిత్ర సృష్టించాడు.స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ కాగానే వెళ్లి డకౌట్‌లో భోజనం చేస్తూ కనిపించాడు.అతను ఫుడ్ తింటూ ఇషాన్ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌తో మాట్లాడుతున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన పిక్‌ను నెటిజన్లు షేర్ చేస్తూ.. బాగా ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు విరాట్ ఇంకా రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది.సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై ఒకరు బాగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొదట రోహిత్ శర్మ ఔట్ కాగానే...విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే..విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక రోహిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WTC

సంబంధిత వార్తలు: