డబ్ల్యూటీసి ఫైనల్.. టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుండేది?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవర్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఒక వైపు టీమిండియా మరోవైపు ఆస్ట్రేలియా కూడా పటిష్టమైన టీమ్స్ కావడంతో ఎవరు విజేత అని ముందే ఊహించలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్లు సెంచరీలతో చెలరేగిపోయి భారీ స్కోరు చేశారు.

 అయితే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మాత్రం మొదట్లోనే తడబడింది అని చెప్పాలి. 151 పరుగులు మాత్రమే చేసి కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇలాంటి ప్రదర్శన చేస్తే అటు టీమిండియా గెలవడం కష్టమే అంటూ ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయ పెడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించ లేక పోయింది అంటూ భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

 ఇలా సానుకూల దృక్పథం లేకపోవడం కారణంగానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. జట్టు రక్షణాత్మక ధోరణి పట్ల అతను నిరాశ వ్యక్తం చేశాడు. టాస్ గెలిచినా భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలాగే బౌలింగ్లో నలుగురు ఫేసర్లు, ఒక స్పిన్నర్లతో టీమిండియా బరులోకి దిగింది. ఒకవేళ సానుకూల దృక్పధం ఉండి ఉంటే కచ్చితంగా మొదట బ్యాటింగ్ చేయాల్సిందే. తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడి ఆపై మొదటి రోజు 250 పరుగులు చేసిన బాగుండేది. ఇప్పుడు ఆస్ట్రేలియా అదే పై చేయి. భారత్ తిరిగి పోటీలోకి రావాలన్న అది ప్రత్యర్థి మీదే ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు గొప్పగా బ్యాటింగ్ చేశారు. తొలిరోజు అద్భుతంగా పట్టు సాధించారు అంటూ రవి శాస్త్రి పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: