సమయం వచ్చేసింది.. ఆ ముగ్గురికి గుడ్ బై చెప్పబోతున్న చెన్నై?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ ప్రపంచం మొత్తం వినోదంలో మునిగి తేలింది అన్న విషయం తెలిసిందే . ఇక ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లను చూస్తూ అసలు సిసలైన క్రికెట్ మజాని పొందారు ప్రేక్షకులు. ఇలా లీగ్ దశ నుంచి ఎంతో రసవత్తరంగా సాగిన 2023 ఐపీఎల్ పోరులో.. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్  ను ఓడించి ఛాంపియన్గా ఐదవ సారి టైటిల్ గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే.

 అంతేకాకుండా 12సార్లు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టిన టీం గా.. పదిసార్లు ఫైనల్స్ ఆడిన ఒకే ఒక జట్టుగా అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీం గా కూడా అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఛాంపియన్గా నిలిచిన చెన్నై ఇక 2024 ఏడాదిలో కూడా అంతే బలంతో బరిలోకి దిగాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 16వ సీజన్లో తమ జట్టుకు భారంగా మారిన కొంతమంది ఆటగాళ్లకు ఉద్వాసన పలికే పనిలో పడిందట చెన్నై సూపర్ కింగ్స్  యాజమాన్యం. ముగ్గురు విదేశీ ప్లేయర్లను వదిలేసుకోవాలని అనుకుంటుందట. ఆ వివరాలు చూసుకుంటే..
 మిచల్ శాంట్నర్  : ఛాన్స్ వచ్చిన ప్రతిసారి శాంట్నర్ బాగానే  రానించాడు. అయితే మహేష్ తీక్షణ వైపు ఎక్కువగా మగ్గు చూపిన ధోని శాంట్నర్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు.  2019 సీజన్ నుంచి ఇప్పుడు వరకు అతను ఆడింది 15 మ్యాచ్లే. దీని బట్టి ధోనిసేన అతన్ని ఎంతలా విస్మరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ నాటికి పక్కన పెట్టాలని అనుకుంటుందట.
 సిసింద మగల  : సౌత్ ఆఫ్రికా తరపున గతంలో చెలరేగిన ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ లో పెద్దగా ఛాన్సులు రాలేదు. పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై ఛాంపియన్గా నిలిచిన అందులో ఇతని పాత్ర శూన్యం. దీంతో ఇతనికి ఉద్వాసన  పలుకాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట.
 బెన్ స్టోక్స్  : ధోని తర్వాత చెన్నై జట్టు కెప్టెన్సీ అందుకుంటాడని అందరూ భావించారు. అతని 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై యాజమాన్యం. ఈ సీజన్లో చెన్నై తరపున పెద్దగా ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్లలోనూ  ఇక పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అంత ధర పెట్టి అతన్ని పెట్టుకోవడం ఎందుకు అని భావించిన యాజమాన్యం వదులుకోవడానికి సిద్ధమైందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: