డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం?
మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టిన పటిష్టమైన ఆస్ట్రేలియా సైతం ఫైనల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఆశిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా మారబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూ లతో అంతకంతకు అంచనాల పెంచేస్తూ ఉన్నారు. అదే సమయంలో యాజమాన్యాలు కూడా గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూటీసి ఫైనల్ నేపథ్యంలో ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు కోసం బ్యాక్ రూమ్ కన్సల్టెంట్ గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండి ఫ్లవర్ ను నియమించుకుంది అన్నది తెలుస్తుంది. ఇంగ్లాండులోని పిచ్ పరిస్థితులపై ఆండి ఫ్లవర్ కు అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందట. కాగా లండన్లోని ఓవల్ మైదానం వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.