డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

praveen
మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు ఆడి బిజీ బిజీగా గడిపిన టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ.. కూడా ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ కు సంబంధించిన టోర్నీ ముగియడంతో ఇక దేశ గౌరవాన్ని నిలబెట్టే మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఇంగ్లాండులోని ఓవల్ వేదికగా జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా క్రికెటర్లు.. ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే గత ఏడాది డబ్ల్యూటీసి ఛాంపియన్షిప్ ట్రోఫీలో  ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ ఫైనల్లో ఓడిపోయింది టీమ్ ఇండియా. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా సాంప్రదాయమైన క్రికెట్లో విశ్వవిజేతగా నిలవాలని ఎంతో దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పాలి.

 అయితే టీమిండియాని గాయాలు బెడద వేధిస్తుంది. ఎంతోమంది కీలకమైన ఆటగాళ్లు గాయం బారినపడి జట్టుకు దూరమైన.. ఇక యంగ్ ప్లేయర్స్ తో పటిష్టంగానే కనిపిస్తుంది టీమిండియా జట్టు. ఇక మరోవైపు అటు ఆస్ట్రేలియా సైతం మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్కు రాగా.. ఇక మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలవాలని ఆశపడుతుంది అని చెప్పాలి. దీంతో ఇక ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం అనేది తెలుస్తుంది. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీఈ డబ్ల్యూ టి సి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

 అదే సమయంలో ఇక ఈ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడవచ్చు అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ను డిడి స్పోర్ట్స్ లో చూడొచ్చు అన్నది తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ ను డిడి స్పోర్ట్స్ లో ఉచితంగా వీక్షించవచ్చు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ డిడి స్పోర్ట్స్ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది. అయితే మ్యాచ్ ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అని చెప్పాలి. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: