ధోని ఉంటేనే ఆడతావా.. పతిరణపై విమర్శలు?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపిఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఐదోసారి టైటిల్ అందుకొని తమకు తిరుగులేదు అని నిరూపించింది. అయితే ఇక చెన్నై జట్టు ఇలా ఐపిఎల్ 16 వ సీజన్లో తిరుగులేని ప్రస్తానం కొనసాగించడంలో శ్రీలంక బౌలర్ మతిషా పతీరణ  పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది అన్న విషయం తెలిసిందే.  శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగ తరహా బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న పతీరణ ఇక అద్భుతమైన బంతులను సంధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ధోని సూచనలతో తన బౌలింగ్ మరింత మెరుగుపరుచుకున్నాడు.

 ప్రతి మ్యాచ్ లో కూడా చెన్నై జట్టులో కీలక బౌలర్గా కొనసాగాడు అని చెప్పాలి. ఇక కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించాడు. దీంతో అతనిపై ప్రశంసలు కూడా కురిపించారు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు. అయితే ఇలా ఐపిఎల్ లో రాణించిన ఆటగాళ్లకు వెంటనే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కడం చూస్తూ ఉంటాం. పతీరణ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఐపీఎల్ లో బాగా రాణించిన  పతిరణకు ఈ టోర్నీ ముగిసిందో లేదో అప్పుడే శ్రీలంక జట్టు తరపున వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అరంగేట్రం అయితే చేశాడు కానీ తన బౌలింగ్ తో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో శ్రీలంక జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శ్రీలంక బౌలర్ మతీషా పతీరణ బౌలింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతడు 8.5 ఓవర్లు వేసి 66 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే ఒక వికెట్ తీసాడు. అయితే అతడు ఇచ్చిన 66 రన్స్ లో 16 ఎక్స్ ట్రా రన్స్ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో పతీరణ వన్డేలకు పనికిరాడు అని కొంతమంది అంటుంటే.. ధోనీ లేకపోతే పతీరణ రాణించలేడు అని మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ యంగ్ బౌలర్ తర్వాత మ్యాచ్లో ఎలా రానిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: