దేశ గౌరవాన్ని నిలబెట్టే సమయం వచ్చేసింది.. కోహ్లీ పోస్ట్ వైరల్?

praveen
మొన్నటి వరకు టీమ్ ఇండియా ఆటగాళ్ళు అందరూ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో బిజీ బిజీగా గడిపారు అన్న విషయం తెలిసిందే. అందరూ ప్లేయర్స్ కూడా వివిధ జట్ల తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ  ఇక జట్టును గెలిపించడం కోసం ఎంతో వీరోచితంగా పోరాడారు. అయితే ఈ పోరాటంలో కొంతమంది విజయం సాధిస్తే కొంతమంది మాత్రం పరాజయం పాలు అయ్యి నిరాశ చెందారు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన టీమిండియా క్రికెటర్లు అందరూ ఇక ఇప్పుడు దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకు మరో కీలకమైన టోర్నీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

 మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం టీం ఇండియా ఆటగాళ్లందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక డబ్ల్యుటిసి ఫైనల్ ఆడబోయే ఆటగాళ్ళ వివరాలను బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో  అందరూ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండు చేరుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోనే ఓవల్ వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా ఈ ఐసీసీ టోర్ని ఉండబోతుంది.

 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో విజయం సాధించి సంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలని ఎంతగానో ఆశపడుతుంది టీమిండియ. అదే సమయంలో మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కప్పు గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అయితే గత ఏడాది రన్నరప్ గా నిలిచిన టీమిండియా ఈ ఏడాది టైటిల్ గెలవాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే భారత ఆటగాలందరూ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు.  ఇకపోతే డబ్ల్యూటీసి  ఫైనల్ గురించి సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. రెండేళ్లుగా అనేక సవాళ్లు.. టెస్ట్ మ్యాచ్ లో తర్వాత అల్టిమేట్ టెస్ట్ కి మేము సిద్ధం అయ్యాం. ఇది దేశానికి గౌరవం తెచ్చే సమయం అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: