టీమ్ ఇండియా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అతనొచ్చేస్తున్నాడు?

praveen
టీమిండియాను గత కొంతకాలం నుంచి గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్స్ గాయం బారినపడి కొన్ని నెలలపాటు ఇక జట్టుకు దూరమయ్యారు. ఇక ఇలా గాయంతో జట్టుకు దూరమైన వారిలో బుమ్రా కూడా ఉన్నాడు. జట్టు లో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా.. టీమిండియా విజయాలలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కొనసాగుతూ ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటాడు. అలాంటి బుమ్రా లేకుండానే గత కొంతకాలం నుంచి టీమిండియా మ్యాచ్ లు ఆడుతుంది. దీనికి కారణం బుమ్రా వెన్నునొప్పి గాయంతో బాధపడుతూ ఉండడమే.

 వెన్నునొప్పి గాయం నుంచి కోలుకొని బుమ్రా మళ్ళీ భారత జట్టులోకి వచ్చినప్పటికీ కొన్ని మ్యాచ్ లలోనే మళ్లీ పాత గాయం తిరగబెట్టింది. దీంతో బుమ్రా ఇక మళ్ళీ జట్టుకు దూరమయ్యాడు. చివరికి సర్జరీ చేయించుకుని వెన్నునొప్పి గాయానికి ఇక శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అనుకున్నాడు. ఇక సర్జరీ కారణంగా కొన్ని నెలల నుంచి అతను జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. దాదాపు అతను టీమిండియా కు దూరమై ఎనిమిది నెలలు గడుస్తుంది. అయితే ఇక ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలను టీమిండియా ఆడబోతుంది.

 ఆ సమయానికి బుమ్రా అందుబాటులోకి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఎనిమిది నెలలగా క్రికెట్కు దూరంగా ఉన్న బౌలర్ బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు తెలుస్తోంది తన షూస్ ఫోటోని అతను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. హలో ఫ్రెండ్ మనం మళ్లీ కలుస్తాం అంటూ క్యాప్షన్ పెట్టాడు బుమ్రా. దీంతో బుమ్రా త్వరలో జట్టులోకి రాబోతున్నాడు అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: