ఫైనల్ ఆడకుండా.. ధోనిపై నిషేధం పడుతుందా?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి ఏడాది ఎంత విజయవంతమైన ప్రస్థానం కొనసాగిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే 2023 ఐపీఎల్ సీజన్ లోను ఇదే రీతిలో ప్రదర్శన చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకు చెన్నై జట్టుని  ఛాంపియన్ టీం అని అందరూ పిలుస్తారో మరో సారి నిరూపించింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ ప్రారంభంలో కాస్త తడబడినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. అంతేకాదు ఐపీఎల్లో ఫైనల్లో అడుగుపెట్టిన మొదటి టీమ్ గా కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 అయితే మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్ గా ఉండడం వల్లే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు చెన్నై జోరు చూస్తే ఈసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఊహించని షాక్ తగలబోతుందా అంటే మాత్రం ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ లో అడుగుపెట్టిన చెన్నై జట్టు కి అటు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని దూరమయ్యే ఛాన్స్ ఉంది.

 ఎందుకంటే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ధోని ఎంపైర్లతో  వాగ్వాదానికి దిగాడు అన్న విషయం తెలిసిందే. బంతిని మార్చడం విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతూ కాసేపు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇలా ఎంపైర్లతో ఆర్గుమెంట్ కు దిగినందుకుగాను మ్యాచ్ రిఫరీ మహేంద్రసింగ్ ధోని కి ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఒక మ్యాచ్ నిషేధం విధిస్తే మాత్రం ఇక ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడబోయే ఫైనల్ మ్యాచ్కు దూరంగా ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: