నేను సంతృప్తిగానే ఉన్నాను.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో ఎప్పటి లాగానే భారీ అంచనాలతో బరి లోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ నిరాశ పరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభం సమయం లో వరుస విజయాలు సాధిస్తూ టైటిల్ పై అభిమానుల్లో ఆశలు రేకెత్తించిన బెంగళూరు టీం.. ఇక తర్వాత కీలకమైన మ్యాచ్లలో మాత్రం ఓటమి చవి చూసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల  ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి పోయింది.


అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అటు బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగి పోయినప్పటికీ కూడా..అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించ లేక పోయింది అని చెప్పాలి. దీంతో ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలి  పోయింది.దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ లో తన ప్రదర్శన పై విరాట్ కోహ్లీ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 2023 ఐపీఎల్ సీజన్లో తన ఆట తీరుతో ప్రస్తుతం సంతృప్తి కరంగా ఉన్నాను అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోవడం మాత్రం ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. చాలామంది తన టి20 క్రికెట్లో వేగం తగ్గింది అని అంటున్నారు. అయితే తాను ఆటను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక చివరి మ్యాచ్లో సెంచరీ చేయడం ఎంతో బాగుందని సెంచరీ సంతోషాన్ని ఇచ్చిన.. అటు జట్టు ఓటమితో మాత్రం బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: