ఏమయ్యా బెన్ స్టోక్స్.. ఇండియా టూర్ బాగా గిట్టుబాటైందే?

praveen
ప్రేక్షకులందరినీ ఎన్నో రోజులుగా ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. లీగ్ మ్యాచ్లో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే మూడు జట్లు ఏంటి అన్న విషయం క్లారిటీ వచ్చేస్తుంది. మొదట గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ లో అడుగు పెడితే ఆ తర్వాత నిన్న జరిగిన మ్యాచ్లలో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెంట్స్ జట్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాయి. ఇక నాలుగో స్థానాన్ని సొంతం చేసుకోబోయే టీం ఏది అన్న విషయంపై మాత్రం ఇప్పుడు క్లారిటీ రానుంది అని చెప్పాలి.

 అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే అదే సమయంలో అటు ఐపిఎల్ ను గాయాలు బెడద కూడా తీవ్రంగా వేధించింది అని చెప్పాలి. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. గాయం కారణంగా టోర్నీకి మొత్తం దూరమైన పరిస్థితి కనిపించింది అని చెప్పాలి. అటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 16.25 కోట్లు పెట్టి భారీ ధరకు కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. 16.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే.. అతను ఈ ఐపిఎల్ సీజన్లో ప్రభావం చూపింది మాత్రం ఏమీ లేదు అని చెప్పాలి.

 ఐపీఎల్ లో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే ఆడాడు బెన్ స్టోక్స్ ఇక ఆ తర్వాత గాయం బారిన పడి మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత అతను కోలుకున్నప్పటికీ  అప్పటికే ఉన్న టీం పటిష్టంగా ఉండడంతో ధోని ఇక అతన్ని జట్టులోకి తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇలా రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన బెన్ స్టోక్స్  ప్రస్తుతం స్వదేశమైన ఇంగ్లాండుకు పయనం అయ్యాడు అన్నది తెలుస్తుంది. నిన్ను నెక్స్ట్ టైం కలుసుకునే వరకు నీకోసం విజిల్ వేస్తూనే ఉంటాం అంటూ స్టోక్స్ ఇంగ్లాండ్ కు పయనం అయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలిసి.. చెన్నై16.25 కోట్లు పెట్టి బెన్ స్టోక్స్ ని ఇండియా టూర్ కి పిలిచినట్టుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: