అరవీర భయంకర టీమ్.. అతి కష్టం మీద వరల్డ్ కప్ కు క్వాలిఫై?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఒక మెగా టోర్నీ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అటు వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈ మెగా టోర్నీకి అటు భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ నేపథ్యంలో అన్ని జట్ల యాజమాన్యాలు కూడా ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై కసరత్తులు చేస్తున్నాయ్. అంతే కాకుండా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఇక వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే కొన్ని జట్లు నేరుగా వరల్డ్ కప్ కి ఎంపికయ్యాయి.



 కానీ కొన్ని జట్లు మాత్రం ఇక వన్డే వరల్డ్ కప్ లో ఎంపిక కావడం కోసం చివరికి కొన్ని జట్లు.. క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇలా వరల్డ్ కప్ లో అర్హత సాధించడం కోసం క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడుతున్న టీమ్లలో అటు సౌత్ ఆఫ్రికా కూడా ఉండడం గమనార్హం. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా అంటే ప్రపంచ క్రికెట్లో బయపడని టీం అంటూ లేదు. ఇక సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ అంటే చాలు ఓడిపోతాం అని ముందే ఫిక్సయి బరిలోకి దిగేవారు అందరూ. కానీ అలాంటి అరవీర భయంకర సౌతాఫ్రికా ఇక ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏకంగా ప్రపంచ క్రికెట్లో ఎక్కడ తన హవా నడిపించలేక పోతుంది. ప్రత్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోతుంది.


 వెరసి ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ ను శాసించిన సౌత్ ఆఫ్రికా టీం.. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోవడం కోసం చివరికి క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే అది కూడా తమ ప్రదర్శన ఆధారంగా అర్హత సాధించలేదు. అదృష్టం కలిసి వచ్చి ఇలా వరల్డ్ కప్ కి క్వాలిఫై అయింది. ఇటీవల బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ వర్షంలో రద్దు కావడం సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చింది. అయితే ఇప్పటివరకు 10 జట్లకు గాను ఎనిమిది టీంలు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి. మిగతా రెండు స్పాట్ల కోసం జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నేపాల్, ఒమన్, స్కాట్లాండ్ దేశాలు పోటీ పడుతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: