ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు చాలా హోరా హోరీగా సాగుతున్నాయనే చెప్పాలి. కొన్ని మ్యాచ్‌లు తప్పిస్తే ఎక్కువ మ్యాచ్‌లు అంచనాలకు ఏ మాత్రం కూడా అస్సలు అందడం లేదు.గెలుపు అంచుల దాకా వచ్చి బోల్తా పడిన జట్లు కొన్నైతే ఖచ్చితంగా ఓడి పోతాయనుకున్న టైంలో అద్భుతాలు చేసి గెలిచిన జట్లు మరికొన్ని ఉన్నాయి. ఇలా ఆద్యంతం ఆసక్తి బరితంగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో పంజాబ్ కింగ్స్‌తో నేడు(సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడనుంది.బలబలాలు, గెలుపోటముల రికార్డులు వంటివి కాసేపు పక్కన పెడితే మాత్రం ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంటున్నారు నెటీజన్లు. సెంటిమెంట్ లేదా లాజిక్ ఏదైనా కానివ్వండి. దీనికి ఓ కారణం కూడా ఉందని నెటిజన్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌లను బేరీజు వేసుకుని వాళ్లు ఈ విషయాన్ని చెబుతున్నారు.ఈ సీజన్‌ను పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో స్టార్ట్ చేసింది.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆ టీం తరువాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ తరువాత ఓ మ్యాచ్‌లో గెలుస్తూ మరో మ్యాచ్‌లో ఓడుతూ అలా వస్తోంది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన మ్యాచుల్లో ఫలితాలు అయితే ఇలా ఉన్నాయి.. W, W, L, L, W, L, W, L, W, L ( W-win, L-lost ). ఈ లెక్కన ఈరోజు కోల్‌కతా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంటున్నారు. మరీ నెటిజన్స్ అంచనాలు నిజం అవుతాయా..? లేక గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి కోల్‌కతా టీం ప్రతీకారం తీర్చుకుంటుందా..? అన్నది కాసేపట్లో చూడాల్సిందే.ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటి దాకా మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది.ఇందులో 5 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అటు కోల్‌కతా టీం కూడా పది మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ టీం విజయం సాధిస్తే 12 పాయింట్లతో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంటుంది.