నిజమే.. వారిపై నిషేధం విధించండి : సెహ్వాగ్

praveen
ఇటీవలే ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో లక్నో జట్టుపై బెంగళూరు విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు.  ఎందుకంటే మ్యాచ్ చివర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్ గా కొన సాగుతున్న విరాట్ కోహ్లీ ఇక లక్నో జట్టు మెంటార్గా కొనసాగుతున్న గౌతమ్ గంభీర్ మధ్య గొడవ సంచలనంగా  మారిపోయింది అని చెప్పాలి.



 గతంలో చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకున్న కోహ్లీ ఇక లక్నోను వారి హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు అదే రిపీట్ చేసి కౌంటర్ ఇచ్చాడు. దీంతో గంభీర్, విరాట్ కోహ్లీ ఒకరికొకరు ఎదురుపడి ఏకంగా విమర్శలు చేసుకున్నారు. ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అనేంతలా వారు ప్రవర్తించారు అని చెప్పాలి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిపరి ఇద్దరికీ 100% మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.



 అయితే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కేవలం జరిమానా విధిస్తే సరిపోదని అంతకుమించిన కఠినమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పుడు ఇలాగే స్పందించాడు మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. మ్యాచ్ ఓడిన వాళ్ళు నిశ్శబ్దంగా ఓటమిని అంగీకరించి వెళ్లాలి. గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటూ వెళ్లాలి. వాళ్ళు సెలబ్రిటీలు.. వాళ్ళు ఏం చేసినా లక్షల మంది చూస్తారు. మావాడు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని బీసీసీఐ కఠినంగా పరిగణించి ఇక వారిపై నిషేధం విధించాలి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: