ఐపీఎల్ హిస్టరీలో.. అర్షదీప్ చెత్త రికార్డ్?

praveen
ఐపీఎల్ ద్వారా తన సత్తా ఏంటో చూపించి ఒక్కసారిగా భారత సెలక్టర్ల చూపును ఆకర్షించిన బౌలర్లలో అటు అర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. తక్కువ సమయంలోనే తన బలంతో ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు అర్షదీప్ సింగ్. ఈ క్రమంలోనే ఇక టీమిండియాలోకి కూడా వచ్చేసాడు. ఇక అప్పటికి జస్ ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండటంతో అర్షదీప్ సింగ్ కి వరుసగా అవకాశాలు దక్కాయ్. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అదరగొట్టాడు అని చెప్పాలి.

 అలాంటి అర్షదీప్ సింగ్ 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం తన బౌలింగ్ తో ఎక్కడ ప్రభావం చూపలేకపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. అయితే ఇక చాలా తక్కువ మ్యాచ్ లలో పరుగులు కట్టడి చేసి ఎక్కువ మ్యాచ్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోవడమే కాదు ఆ జట్టు బౌలర్ అర్షదీప్ సింగ్ మాత్రం చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.

 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3.5 ఓవర్లు వేసి ఏకంగా 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీ లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో అర్షదీప్ మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు బాసిల్ తంపి 2018 ఐపీఎల్ సీజన్లో 70 పరుగులు ఇచ్చి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. యష్ దయాల్ 2023లో 69 పరుగులు ఇచ్చి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మాజీద్ ఉర్ రెహమాన్ 66 పరుగులతో మూడవ స్థానంలో ఉండగా అతనితో కలిసి 66 పరుగులు ఇచ్చిన అర్షదీప్ కూడా మూడవ స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: