2023 ఐపీఎల్ లో.. ఇలా మొదటిసారి జరిగిందబ్బా?
దీంతో ఇక ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ ఏ క్షణంలోనైనా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో వరుణుడు కాస్త కరుణించి మ్యాచ్ జరిగేలా చూస్తే బాగుండు అని అభిమానులు కోరుకున్నారు. కానీ చివరికి ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ పూర్తికానే లేదు అప్పుడే మ్యాచ్ రద్దయింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ఈ క్రమంలోనే ఇక వర్షం మళ్ళీ రావడంతో మ్యాచ్ ను కాసేపు నిలిపివేశారు. కానీ మళ్ళీ మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో చివరికి మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు ఫీల్డ్ ఎంపైర్లు ప్రకటించారు. అయితే ఇక ఇలా మ్యాచ్ ను రద్దు చేయడం కారణంగా.. ఇరు జట్లకు కూడా చెరో పాయింట్ ఇచ్చారు అని చెప్పాలి. అయితే ఇలా మ్యాచ్ రద్దు కావడం కూడా ఒక రికార్డు అని చెప్పాలి. ఈ సీజన్లో వర్షం కారణంగా రద్దు అయిన మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అయితే మ్యాచ్ జరిగి ఉంటే తప్పకుండా తమ జట్టు గెలిచేదని ఇరు జట్ల అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.