ఓటమి మాత్రమే కాదు.. బెంగళూరు చెత్త రికార్డు?

praveen
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ప్రతి జట్టు కూడా ఏదో ఒక రికార్డు సాధించడం లాంటివి చేస్తూ ఉంటుంది . ముఖ్యంగా తమ ప్రదర్శనతో అరుదైన రికార్డులు సృష్టించడం చేస్తుంది ప్రతి టీమ్. కానీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం మిగతా జట్లకు సాధ్యం కానీ చిత్ర విచిత్రమైన రికార్డులను అప్పుడప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే బెంగళూరు టీం ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నది ఊహకందని రీతిలోనే ఉంటుంది.



 ఎందుకంటే గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడి పోతూ ఉంటుంది. అదే సమయంలో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లలో గెలుస్తూ ఉంటుంది. ఇక ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి చివరికి కీలకమైన మ్యాచులలో చేతులెత్తేసి.. ఇక టోర్ని నుంచి నిష్క్రమిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ ఇలాంటి ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఇకపోతే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలా అభిమానుల అంచనాలను తారుమారు చేసింది అని చెప్పాలి.



 కోల్కతా నైట్ టైటిల్స్ జట్టు చేతిలో ఏకంగా 21 పరుగులు తేడాతో ఓడిపోయింది బెంగళూరు జట్టు. 200కు పైగా స్కోర్ ప్రత్యర్థికి సమర్పించుకుని దాన్ని చేదించలేకపోయింది. దీంతో చెత్త రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు 200 సమర్పించుకున్నట్టుగా జట్టు నిలిచింది. ఏకంగా 24 సార్లు 200 రన్స్ లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు బెంగళూరు జట్టుపై ప్రత్యర్థులు చేశాయి. ఇక ఈ లిస్టులో పంజాబ్ టీమ్స్ 23, కేకేఆర్ 18, చెన్నై సూపర్ కింగ్స్ 17 సార్లు 200 స్కోర్ లు ఇచ్చిన జట్టుగా ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాకుండా  200 పరుగుల భారీ స్కూల్ చేదించే అవకాశం బెంగళూరు జట్టుకి 16 సార్లు ఎదురవగా.. కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: