అనుష్కతో సెల్ఫీకి అభిమాని అత్యుత్సాహం.. సహనం కోల్పోయిన కోహ్లీ?

praveen
సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్లలో కనిపిస్తే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న విషయాన్ని మరిచిపోయి కాస్త అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు జనాలు. ఇక తమ అభిమాన సెలబ్రిటీల నుంచి ఒక ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా అభిమానుల్లో ఉండే ఆరాటమే కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీలకు అనుకొని ఇబ్బందులను తెచ్చి పెడుతూ ఉంటుంది అని చెప్పాలి. దీంతో కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు సైతం అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.



 ఇక్కడ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అయినా అనుష్క శర్మకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. విరుష్క జంట ఇటీవలే పబ్లిక్ ప్లేస్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఇక వారిని చూసేందుకు అభిమానులు అందరూ కూడా భారీగా తరలివచ్చారు అని చెప్పాలి. కానీ అభిమానుల తీరుతో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు.  బెంగళూరులోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు విచ్చేశారు విరుష్కా జంట. అయితే ఈ విషయం చుట్టుపక్కల ఉన్న వారికి తెలియడంతో అక్కడికి వచ్చి అందరూ గుమగుడారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.


 దీంతో భోజనం ముగించుకున్న అనంతరం విరుష్క జంట బయటకు వచ్చి కారు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. ఇక భద్రత సిబ్బంది అభిమానులను నివారించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక ఎంతో కష్టపడి కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలోనే అనుష్క కారు వద్దకు వెళుతుండగా ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇక అనుష్క వెనకాలే వస్తున్న విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: