ఐపీఎల్ : ఓరి నాయనో.. ఒక్క ఓవర్ విలువ 60 లక్షలు?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో బౌలర్లు అందరూ కూడా తమ ప్రతిభను చాటుకునివీర విహారం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను వనికిస్తూ మెరుపు వేగంతో బంతులను  విసురుతున్నారు. మరి కొంతమంది బౌలర్లు తమ స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు బౌలర్లు అత్యుత్తమ గాణాంకాలు నమోదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఐపీఎల్ లో ఒక బౌలర్ ఏకంగా 60 లక్షల విలువ చేసే ఓవర్ వేశాడు అంటే ఎవరైనా నమ్ముతారా.

 60 లక్షల విలువైన ఓవర్ వేయడమేంటి..  ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఇటీవలే ఐపీఎల్లో ఇదే జరిగింది. ఏకంగా ఒక యువ బౌలర్ 60 లక్షల విలువ చేసే ఓవర్ ను వేశాడు. ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్,  పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోరులో పంజాబ్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే  ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ ఇలా 60 లక్షల విలువైన ఓవర్ వేశాడు.

 60 లక్షల విలువైన ఓవర్ అంటున్నారు. కానీ అసలు ఎందుకు అది అంత కాస్లీ అన్నది చెప్పడం లేదు అని ఎదురుచూస్తున్నారు కదా. చివరి ఓవర్లో గెలుపు కోసం ముంబై ఇండియన్స్ కి 16 పరుగులు కావాల్సి ఉండగా.. అర్షదీప్ వరుసగా రెండు వికెట్లు తీసి రెండు రన్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే అర్షదీప్ బౌలింగ్ దెబ్బకి రెండుసార్లు ఎల్ఈడి స్టంపులు ముక్కలు అయ్యాయి. అయితే ఒక్క ఎల్ఈడి స్టంప్ ధర దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది. అంటే రెండుసార్లు ఎల్ఈడీ స్టంప్ లు ముక్కలు కావడంతో ఐపీఎల్ నిర్వహకులకు 60 లక్షల నష్టం వాటిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: