లాస్ట్ ఓవర్.. 4 బంతుల్లో 4 వికెట్లు.. ఇది కదా ఉత్కంఠ అంటే?
అయితే ఎంతో పటిష్టంగా ఉన్న లక్నో జట్టు 135 పరుగుల టార్గెట్ ను ఎంతో అలవోకగా చేదిస్తుంది అని అందరూ భావించారు. అయితే మ్యాచ్ జరుగుతుంటే ఇక లక్నో దూకుడు అయిన బ్యాటింగ్ చూసిన తర్వాత 15 ఓవర్లలోనే టార్గెట్ ను చేదించడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్ది పరిస్థితులు పూర్తిగా లక్నో నుంచి గుజరాత్ కు అనుకూలంగా మారిపోయాయి. ఎవరు కలలో కూడా ఊహించిన విధంగా అనూహ్యంగా గుజరాత్ జట్టు ఏకంగా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.
అయితే ఇక ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఎలాంటి ఉత్కంఠ అయితే ప్రేక్షకులు కావాలి అని కోరుకున్నారో.. అంతకుమించి అనే రేంజ్ లోనే ఉత్కంఠ నెలకొంది ఆఖరి ఓవర్ లో లక్నో గెలుపుకు 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలోనే గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ బంతి వేస్తున్నాడు. అయితే అద్భుతమైన బౌలింగ్ తో కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇవ్వడంతో పాటు రెండు వికెట్లు తీశాడు మోహిత్ శర్మ. అంతే కాకుండా ఆ ఓవర్ లో రెండు రనౌట్స్ అయ్యాయి. రెండు, మూడు బాల్స్ కి కేఎల్ రాహుల్, స్టోయినిష్ రూపంలో కీలకమైన బ్యాట్స్మెన్ల వికెట్లు తీయగా..ఆ తర్వాత నాలుగు, ఐదు బంతులకు బదోని, హుడా రూపంలో రెండు రనౌట్లు అయ్యాయి అని చెప్పాలి.