
డిఆర్ఎస్.. ఇప్పుడు విఆర్ఎస్ గా మారింది.. కోహ్లీ అదుర్స్?
ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 59 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో 174 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 150 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇక మరోవైపు బ్యాటింగ్లో మాత్రమే కాదు అటు రివ్యూలు తీసుకోవడంలో కూడా విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి రెండు సార్లు రివ్యూ తీసుకొని సఫలం అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కింగ్స్ఇన్నింగ్స్ రెండో బంతికి ఆ జట్టు ఓపెనర్ అధర్వ టైడే వికెట్ కోసం ఎల్పి మహమ్మద్ సిరాజ్ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ బౌలర్ అప్పీల్ ను తిరస్కరించడంతో.. కోహ్లీ రివ్యూకీ వెళ్ళాడు. రివ్యూలో ఎల్బిడబ్ల్యుగా తేలింది.. దీంతో వికెట్ దక్కింది.
ఇక ఆ తర్వాత నాలుగో ఓవర్లో మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ అయింది అని చెప్పాలి. ఇక అప్పుడు కూడా బౌలర్ సిరాజే కావడం గమనార్హం. అయితే నాలుగో రెండో బంతిని లివింగ్ స్టోన్ ఎల్ బి డబ్ల్యూ కోసం సిరాజ్ అప్పీల్ చేశాడు. అప్పుడు కూడా అంపైర్ బౌలర్ అప్పీల్ ను తీరస్కరించాడు. దీంతో కెప్టెన్ కోహ్లీ కలుగజేసుకొని రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ఎల్బీడబ్ల్యూ అయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఫీల్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అవుట్ గా ప్రకటించాడు. అయితే రెండుసార్లు రివ్యూ తీసుకొని విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యాడు. దీంతో డిఆర్ఎస్ను విఆర్ఎస్ గా మారిందని కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.