డాట్ బాల్స్ వేయటంలో.. సిరాజ్ తోపు.. ఎందుకంటే?

praveen
హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల కాలంలో ఎంత అద్భుతమైన బౌలర్ గా ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆటతీరుతో అటు టీమిండియాలో కీలక బౌలర్గా మారిపోవడమే కాదు.. ఇక ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనికిస్తూ సరైన సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక తన బౌలింగ్ ప్రదర్శనతో అరుదైన రికార్డులను కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు సిరాజ్ ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు స్టార్ బ్యాట్స్మెన్ సైతం ఈ హైదరాబాద్ బౌలర్ బంతులను ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నాడు. పరుగులు చేయడానికి తెగ కష్టపడి పోతున్నారు. ఇలా ఒకవైపు పరుగులు కట్టడి  చేస్తూనే మరోవైపు ఇక వికెట్లు కూడా పడగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ సిరాజ్ ఇటీవల ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ వేసిన ప్లేయర్గా నిలిచాడు మహమ్మద్ సిరాజ్. ఇప్పుడు వరకు ఐదు మ్యాచ్లలో కలిపి 20 ఓవర్లు వేశాడు సిరాజ్. కాగా ఈ 20 ఓవర్లలో 69 డాట్ బాల్స్ వేసాడు. ఈ సీజన్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అదే సమయంలో పవర్ ప్లే లో 72 బంతులు వేసి 51 బంతులలో పరుగులు ఇవ్వకుండా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక అలాగే ఏడు ఎకనామితో ఎనిమిది వికెట్లు తీసాడు. తర్వాత స్థానంలో 65 బాల్స్ తో శమీ, 48 బాల్స్ తో జోసెఫ్, మార్క్ వుడ్ 45, రషీద్ ఖాన్ 45, భువనేశ్వర్ కుమార్ 45, అర్షదీప్ 45 డాట్ బల్స్ తో తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఎంత అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడో అన్నది అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: