ఐపీఎల్ లో తొలి వికెట్.. అర్జున్ ఏమన్నాడంటే?
ముఖ్యం గా ఐపీఎల్ లో అర్జున్ ఆడుతాడేమో అని గత రెండు మూడు సీజన్ల నుంచి కూడా అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ అర్జున్ టెండూల్కర్ కి తుది జట్టు లో మాత్రం చోటు దక్కలేదు. ఎట్టకేలకి 2023 ఐపీఎల్ సీజన్లో అర్జున్ టెండూల్కర్ కి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం దొరికింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో కూడా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అంతేకాదు రోహిత్ అతనిపై నమ్మకం ఉంచి డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ వేయిస్తున్నాడు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తన తొలి ఐపిఎల్ వికెట్లు నమోదు చేశాడు అర్జున్ టెండూల్కర్. కీలకమైన ఆఖరి ఓవర్ ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భువనేశ్వర్ కుమార్ వికెట్ పడగొట్టి ముంబై జట్టుకు విజయం అందించాడు. అయితే ఐపీఎల్ లో తనకు తొలి వికెట్ దక్కడంపై అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్కి ముందు ప్లాన్స్ గురించి తండ్రితో మాట్లాడుతానని.. కానీ లైన్ అండ్ లెంత్ గురించి మాత్రం తానే దృష్టి సారిస్తాను అంటూ అర్జున్ టెండూల్కర్ చెబుతున్నాడు.