సూర్య కాదు.. అతనే 360 డిగ్రీస్ ప్లేయర్ : పీటర్సన్

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా నరాలు తిరిగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న పోరు అటు ప్రేక్షకులు అందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇంతే ఉత్కంఠతో సాగింది. ఏకంగా చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో అన్న క్లారిటీ లేకుండా పోయింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో ముంబై విజయం సాధించింది.



 అయితే ముంబై జట్టు విజయం సాధించినప్పటికీ అటు కోల్కతా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న వెంకటేష్ అయ్యర్ మెరుపు సెంచరీ తో చెలరేగిపోయిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలిచింది అని చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వెంకటేష్ అయ్యర్ తన బ్యాటింగ్తో పూనకం వచ్చినట్లుగానే ఊగిపోయాడు. 49 బంతుల్లోనే 104 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని మెరుపు సెంచరీ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్  పీటర్సన్ స్పందించాడు.



 ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేయడంపై ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. అయ్యర్ 49 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ అద్భుతం. అతను చాలా ఎత్తుగా ఉండడం వల్ల బౌన్సర్లను ఎంతో ఈజీగా ఆడగలుగుతున్నాడు. బ్యాక్ ఫుట్ షాట్లను కూడా ఎంతో చక్కగా బౌండరీ తరలిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లోను వెనకడుగు వేయడం లేదు. అతను 360 డిగ్రీస్ ప్లేయర్ అంటూ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. కాగా భారత్ క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్గా అటు సూర్యకుమార్ గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: