RCB vs DC: అల్లాడుతున్న ఢిల్లీ.. ఇది పోయినట్టే?

frame RCB vs DC: అల్లాడుతున్న ఢిల్లీ.. ఇది పోయినట్టే?

Purushottham Vinay
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఆడుతుంది.. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టీం ఇప్పటి దాకా మొత్తం మూడు మ్యాచులు ఆడింది. మొదటి మ్యాచ్‌లో ముంబై పై విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో కేకేఆర్‌ ఇంకా లక్నో జట్ల చేతిలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచులో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని ఆ టీం భావిస్తోంది. ఓపెనర్లు డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీలు ఆ జట్టుకు బలం ఇంకా బలహీనత. వీరు చెలరేగితే మ్యాచ్‌లు టీం ఈజీగా గెలుస్తుంది. వీరిద్దరు విఫలం అయితే మాత్రం ఖచ్చితంగా ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇలా ఇద్దరిపై ఆధారపడకుండా సమిష్టిగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేదంటే ఈ సారైనా కప్పు అందుకోవాలన్న ఆశ నెరవేరడం చాలా కష్టం కావచ్చు.అటు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి దాకా నాలుగు మ్యాచులు ఆడగా అన్నింటిల్లో కూడా ఓటమి పాలైంది. కనీసం బెంగళూరు పైనా అయినా విజయం సాధించి ఈ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టాలని ఆ టీం ఆరాడపడుతోంది.


ఆ జట్టులో ఓపెనర్‌, కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ ఇంకా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మాత్రమే రాణిస్తున్నారు. మిగిలిన ప్లేయర్స్ కూడా బాధ్యతను తీసుకోవాలి. లేదంటే ఇక ఖచ్చితంగా మరో ఓటమి తప్పదు. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మొత్తం 174 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో బాగా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌(22), లోమ్రోర్ (26) ఇంకా మాక్స్‌వెల్‌(24)లకు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంతో మాత్రం బాగా విఫలం అయ్యారు.ఓ దశలో బెంగళూరు టీం మూడు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఇక ఆ దశలో బెంగళూరు 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే.. వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మొత్తం 132/6 గా నిలిచింది. ఇక చివరికి 174 పరుగులు చేసింది.ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ టీం చాలా దారుణంగా 8 వికెట్లు కోల్పోయి కేవలం 111 మాత్రమే చేసింది.చూస్తుంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయేలా వుంది ఢిల్లీ టీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: