ఐపీఎల్ 2023 : ఫాస్టెస్ట్ డెలివరీ నమోదు?
ఇక ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ డెలివరీ ఏది అని చర్చ తెర మీదకి వచ్చినప్పుడల్లా అటు భారత బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఫాస్ట్ బౌలింగ్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను వనికించాడు అని చెప్పాలి. అయితే ఫాస్ట్ గా బౌలింగ్ చేయడం విషయంలో ఉమ్రాన్ మాలిక్ కి ఎవరైనా గట్టి పోటీ ఇస్తారు అంటే అతను ఎవరో కాదు ఫెర్క్యూసన్ అని చెప్పాలి. గత ఐపిఎల్ సీజన్ లో కూడా ఇలా వేగంగా బంతులు విసరటం విషయంలో ఉమ్రాన్ మాలిక్ ఫెర్క్యూసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీ నమోదయింది అని చెప్పాలి. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇటీవల కోల్కతా బౌలర్ ఫెర్క్యూసన్ ఏకంగా 154.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఇదే ఇప్పుడు వరకు ఫాస్టెస్ట్ బాల్ గా కొనసాగుతోంది అని చెప్పాలి. ఫెర్క్యూసన్ 6 ఓవర్ వేయగా 149.01, 154.1, 151.4, 129.01 కిలోమీటర్ల వేగంతో బంతులను విసిరాడు ఫెర్క్యూసన్. ఐపీఎల్ ముగిసే సరికి ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి మరి.