ఐపీఎల్ - 2023 : అదరగొట్టిన రషీద్ ఖాన్.. తొలి హ్యాట్రిక్?

praveen
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభమై ఎప్పటిలాగానే ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆటగాళ్లు కూడా రికార్డుల వేట ప్రారంభించారు. ఇక తమ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన బౌలర్ల జాబితా తీస్తే అందులో ఆఫ్గనిస్తాన్ జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న రషీద్ ఖాన్ పేరే మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది.

 అంతర్జాతీయ క్రికెట్లో లాగానే అటు ఐపిఎల్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రషీద్ ఖాన్. స్టార్ బ్యాట్స్మెన్లను  సైతం ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే ఎంతటి దిగ్గజ బ్యాట్స్మెన్ అయినా సరే ముందుగా పరుగులు చేయడానికి కాదు వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక అలాంటి రషీద్ ఖాన్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అటు కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో మరో రికార్డు సాధించాడు.
 ఐపీఎల్ 2023 సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు రషీద్ ఖాన్. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కెప్టెన్సీ చేపట్టిన రషీద్ ఖాన్ వరుసగా మూడు వికెట్లు తీశాడు అని చెప్పాలి. 16 ఓవర్లో ఇలా హ్యాట్రిక్ సాధించడం గమనార్హం. తొలి మూడు బంతుల్లో వరుసగా రసేల్ సునీల్ నరైన్, శార్దూల్ ఠాగూర్ లను తన వైవిద్యమైన బంతులతో పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఇలా రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి దెబ్బ కొట్టడంతో ఇక చేజింగ్కు దిగిన కోల్కతా కష్టాల్లో పడింది.. కానీ చివర్లో రింకు సింగ్ మ్యాజిక్ చేయడంతో విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: