
మెరుపు ఇన్నింగ్స్ కి ముందు.. ధోని రహానేకి ఏం చెప్పాడో తెలుసా?
అత్యుత్తమమైన రికార్డులు కలిగిన ఈ రెండు జట్లు ఎప్పుడు తలబడిన కూడా అటు హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అభిమానులు అందరికీ అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందుతూ ఉంటుంది. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో కూడా ఇటీవల ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద 157 పరుగులు చేసింది. అయితే ఐపీఎల్ లో 158 పరుగుల టార్గెట్ అంటే మంచి లక్షమే. కానీ అటు అజింక్య రహానే మెరుపు ఇన్నింగ్స్ ముందు ముంబై విధించిన టార్గెట్ చిన్నది అయిపోయింది అని చెప్పాలి.
సాధారణంగా అయితే అజింక్య రహని ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ ఇటీవల ipl లో విధ్వంసకర బ్యాటింగ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. 19 బంతుల్లో అర్థ శతకం. ఇక 27 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ చెప్పేసాడు. బ్యాటింగ్ కి రావడానికి ముందు ధోని ఒక మాట అన్నాడు. బాగా ప్రిపేర్ అవ్వు. నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపిస్తున్న. వెళ్లి ఆటను ఎంజాయ్ చెయ్. ఒత్తిడిని మాత్రం దరిచేరనీయకు.. మేమంతా నీకు సపోర్ట్ గా ఉన్నాం. ఈరోజు ఆట నీది.. బాగా ఆడు అని ధోని చెప్పాడు. ధోని ఇచ్చిన ధైర్యంతోనే తాను మెరుపు ఇన్నింగ్స్ ఆడానని రహానే చెప్పుకొచ్చాడు.