దిగ్గజాలకు సాధ్యం కానీ రికార్డ్.. బ్యాటింగ్లో అశ్విన్ సొంతం?
సాధారణంగా అయితే రవిచంద్రన్ అశ్విన్ కేవలం స్పిన్నర్ మాత్రమే కానీ ఇటీవల కాలంలో బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరూపిస్తున్నాడు. టీమిడియాకు అవసరమైన సమయంలో ఎన్నోసార్లు గెలిపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు అన్ని స్థానాల్లో ఇప్పటివరకు బ్యాటింగ్ చేశాడు అశ్విన్. ఈ క్రమంలోనే ఇలా అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు..
ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్ గా బలిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ చేసిన ఈ ప్రయోగం మాత్రం బెడిసి కొట్టింది.ఎందుకంటే ఓపెనర్ గా వచ్చిన అశ్విన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. హర్షదీప్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుతిరిగాడు అని చెప్పాలి. రాజస్థాన్ అశ్విన్ తో చేసిన ప్రయోగం బెడిసి కొట్టినప్పటికీ అశ్విన్ మాత్రం ఇక ఇలా ఓపెనర్ గా రావడం కారణంగా అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఒకే ఒక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఓపెనర్ గా ఒకసారి నెంబర్ 3 లో నాలుగు సార్లు, నెంబర్ ఫోర్ లో ఒక్కసారి, నెంబర్ 5 లో రెండుసార్లు, నెంబర్ 6 లో ఐదు సార్లు, నెంబర్ 7 లో 16 సార్లు నెంబర్ 8 లో 32 సార్లు, నెంబర్ 9 లో 11 సార్లు, చివరిగా పదో స్థానంలో నాలుగు సార్లు బ్యాటింగ్ కి వచ్చాడు.