ముంబై 5, చెన్నై 4 సార్లు టైటిల్ కొట్టినా ..మా జట్టు ఎంతో ఉత్గామంగా ఆడుతుంది?

praveen
ఐపీఎల్ 2023 ఘనంగా మొదలైంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు ఐదు సార్లు ముంబై ఇండియన్స్ టీం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. కానీ మూడు సార్లు ప్లే ఆఫ్ కి వెళ్లినప్పటికీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు. ప్రస్తుతం 16వ సీజన్ ఎంతో అట్టహాసంగా మొదలైన సందర్భంలో ఆర్ సి బి జట్టు ఆట తీరుపై, అలాగే తమ భవిష్యత్తు ప్రణాళికలపై విరాట్ కోహ్లీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుని తాము కూడా టైటిల్ రేసులో ఉన్నాము అంటూ సత్తా చాటింది బెంగళూరు జట్టు. ముంబై ఇండియన్స్ పై అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా అతని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్ర వైరల్ గా మారుతున్నాయి. తాము ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు, అందరూ చెబుతున్నట్టుగా ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ కొట్టింది. చెన్నై నాలుగు సార్లు టైటిల్ ని గెలిచింది. కానీ మేము అత్యంత ఎక్కువ సార్లు ప్లే ఆఫ్ కు వెళ్లాం. అంతేకాదు మా జట్టు చాలా నిలకడగా ఆడుతుంది అనడానికి ఇదే నిదర్శనం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమతూకంగా ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. మా జట్టుకు ఇప్పుడు ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం చాలా అవసరం. అందుకోసం మంచి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నాం. వాటిని అమలు చేయడానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నాం. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో మొదట బంతి వస్తున్న తీరు మా బ్యాట్స్ మెన్ ని కాస్త తికమక పెట్టిన ఆ తర్వాత సెటిల్ అయి  ముంబై బౌలర్లను బెంగుళూరు బ్యాట్స్మెన్ ఒత్తిడి కి గురి చేయగలిగారు అంటూ కోహ్లీ తెలిపాడు. ఇక ఆరవ తేదీన కోల్కతాతో బెంగళూరు జట్టు పోటీ పడనుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే మూడు సార్లు ఫైనల్ గా చేరింది. 2009 , 2011 2016 సీజన్లో ప్లే ఆఫ్ కి వెళ్ళినప్పటికీ కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. ఎంతో మంచి కీలకమైన ఆటగాళ్లు ఉన్న బెంగుళూరు జట్టు ఇప్పటి టైటిల్ నెగ్గక పోవడం  గమనించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: