చెన్నై vs లక్నో.. ధోని సేన బోణి కొడుతుందా?
ఈ క్రమం లోనే తమ అభిమాన జట్లను ఎంకరేజ్ చేసేందుకు అటు ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంస్ లో నిండి పోతు ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగ బోతుంది. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. గత ఏడాది ఐపీఎల్ లో అడుగుపెట్టి మంచి ప్రదర్శన తో అభిమానులను సంపాదించుకున్న లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది.
అయితే ఈ ఐపీఎల్ సీజన్ ను అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది అని చెప్పాలి. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా ఉంది అని చెప్పాలి. ఇక ఫస్ట్ మ్యాచ్ లోనే గెలిచి మంచి జోరు మీద ఉంది. ఈ క్రమంలోనే నేడు ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే అటు చెన్నై సూపర్ కింగ్స్ నేడు జరగబోయే మ్యాచ్ లో గెలిచి బోని కొట్టాలని భావిస్తుంది అని చెప్పాలి.