ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ శుక్రవారం నాడు సాయంత్రం (మార్చి 31) ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి దశలో 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.ఇక ఆ తర్వాత ప్లేఆఫ్‌లు జరుగుతాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లన్నింటినీ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లో వీక్షించవచ్చు. అయితే, ఈసారి డిస్నీ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్ అనేది ఉండదు. ఎందుకంటే పారామౌంట్ గ్లోబల్, అంబాని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ Viacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను ఏకంగా రూ.20,500 కోట్లకు కొనుక్కుంది. ఇంకా అంతేకాదు.. ఐపీఎల్‌ను ఫ్రీగా ప్రసారం చేస్తామని కూడా ప్రకటించింది. అందువల్ల ఈసారి IPL ను jio యాప్‌లో ఫ్రీగా వీక్షించవచ్చు.
Jio వెబ్ ద్వారా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో IPLని ఫ్రీగా చూడవచ్చు.ఇక విదేశాల్లో ఉన్న వారు అయితే ఇప్పటికే జియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించవచ్చు. అయితే ఆ దేశాల్లో జియో స్ట్రీమింగ్ అందుబాటులో లేకుంటే.. VPNని ఉపయోగించి ఫ్రీగా 2 లైవ్ ని చూడవచ్చు.ఇంకా అలాగే, భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్‌ల ద్వారా టీవీలో మ్యాచ్‌లను చూడవచ్చు.ఇక మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లు అయితే ప్లేస్టోర్‌కి వెళ్లి jio యాప్ ని సెర్చ్ చేయండి. అక్కడ కనిపించే జియో యాప్‌ని డౌన్లోడ్ చేసి తరువాత దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇక ఆ తర్వాత హోమ్ పేజీలోకి వెళితే మీకు టాటా ఐపీఎల్ ఆప్షన్ కనిపిస్తుంది.ఆ మ్యాచ్‌లను చూడటానికి మీరు దానిపై క్లిక్ చేయండి. apple ఫోన్ వినియోగదారులు అయితే apple Store ద్వారా jio అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోని మ్యాచ్ లని చూడవచ్చు.