కోహ్లీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్.. సోషల్ మీడియాలో వైరల్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే ఫాలోవర్ల విషయంలో ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు. ఈ కేవలం ఫాలోవర్లను సంపాదించుకోవడంలోనే కాదు రికార్డులు సాధించడంలోనూ కోహ్లీ తోపు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. నేటితరం క్రికెటర్లు రికార్డులు సాధించడం విషయంలో ఒక్కరు కూడా అటు కోహ్లీ దరిదాపుల్లో లేరు అని చెప్పాలి.

 ఇలా తన ఆట తీరుతో తన యాటిట్యూడ్ తో కూడా విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హవా నడిపిస్తున్నాడు అని చెప్పాలి. అటు భారత జట్టు తరుపున మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ తన ప్రదర్శనలతో ఎప్పుడు అభిమానులను ఉర్రూతలూగిస్తూ  ఉంటాడు. అయితే ఇంత క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీకి సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వస్తే అది ఇంటర్నెట్ ను ఎలా షేక్ చేస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు ఇలాంటిదే ఒక విషయం జరిగింది. ఏకంగా విరాట్ కోహ్లీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

 2004లో విరాట్ కోహ్లీ పదవ తరగతి పాస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఇక విరాట్ కోహ్లీ పదవ తరగతి మార్క్ షీట్ వైరల్ గా మారిపోయింది. ఇక దీనిని స్వయంగా విరాట్ కోహ్లీ కూ యాప్ లో షేర్ చేశాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇది చూడ్డానికి అభిమానులు అందరూ తెగ ఆసక్తి చూపుతున్నారు.. కాగా ఇక విరాట్ కోహ్లీ ఎంత మార్కులు సాధించాడు అని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాగా విరాట్ కోహ్లీ మొత్తం ఆరు సబ్జెక్టుల్లో మంచి మార్కులు సంపాదించాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈ పోస్ట్ పెట్టిన కోహ్లీ కాసేపటికే డిలీట్ చేసాడు. కాగా టెన్త్ పాసై ఇంటర్ చేసిన కోహ్లీ ఆ తర్వాత క్రికెట్ లోకి వచ్చాడు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: