అర్జున్ టెండూల్కర్ కు ఛాన్స్ ఇస్తారా.. రోహిత్ ఏమన్నాడంటే?

praveen
భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం తన ఆట తీరుతో హవా నడిపించాడు సచిన్ టెండూల్కర్ . ఇక ప్రస్తుతం ఉన్న లెజెండరీ క్రికెటర్లు అందరిలో కూడా మొదటి వరుసలో సచిన్ పేరు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక సచిన్ తన కెరీర్ లో సాధించిన రికార్డులను నేటి రోజుల్లో ఉన్న ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ సైతం సాధించలేకపోతున్నారు. ఇక ఇంత గొప్పగా ప్రస్తానాన్ని కొనసాగించాడు కాబట్టే సచిన్ను అందరూ క్రికెట్ దేవుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా సచిన్ ను చూసి ఇక క్రికెట్లోకి అడుగుపెట్టిన అతని వారసుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు.

 ఎంతోమంది యువ ఆటగాళ్లు పాతికేళ్లు కూడా నిండకముందే అటు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి అదర  కొడుతూ ఉంటే క్రికెట్ లెజెండ్ సచిన్ కొడుకు మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే అటు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు అన్నమాటే కానీ అతనికి ఒక్కసారి కూడా తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. దీంతో ఇక అతని పట్ల ముంబై ఇండియన్స్ యాజమాన్యం వివక్ష చూపిస్తుంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. కేవలం సచిన్ కొడుకు కావడంతోనే 20 లక్షల బెస్ట్ ప్రైస్ పోతే పోనీ అనుకుని అతను జట్టులో పెట్టుకుంటుందని మరి కొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

 గత ఏడాది పేలవ  ప్రదర్శన చేసిన సమయంలో అయినా అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో చోటు తగ్గుతుంది అనుకుంటే అది జరగలేదు. ఇక ఇటీవలే రోహిత్ శర్మకు అర్జెంట్ టెండుల్కర్ గురించి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. 2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ లో అర్జున్ ఉంటున్నాడు. కానీ ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. ఈసారైనా అరంగేట్రం చేస్తాడా లేదా అని జర్నలిస్టుల ప్రశ్నించగా.. మంచి ప్రశ్న అడిగారు.. అతను అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ సమాధానం చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఈసారైనా తుది జట్టులోకి వచ్చే మోక్షం అర్జున్ టెండూల్కర్ కు  లభిస్తుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: